యువకులు దురలవాట్లకు దూరంగా ఉండండి
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: దేశ ప్రజల యువకులు, ముస్లిం యువతీ, యువకులు దురలవాట్లకు దూరంగా ఉండాలని మౌలివి హబీబుల్లా జామయి ఉపదేశించారు. ఆహలె హదీస్, ఆలేసున్నతుల్ జమాత్, త బ్లిక్ జమాత్, దూదేకుల సున్ని జమాత్ మసీదుల నుండి ముస్లిం సోదరులు అల్లాను ప్రార్థిస్తూ పురవీధుల గుండా ఈదుగాకు చేరుకుని నమాజు చేశారు. అహలె హదీ స్ ఈదుగాలో మౌల్వి హబీబుల్లా జామయి ముస్లింలను ఉద్దేశించి ప్రసంగిస్తూ యువతీ ,యువకులు నమాజ్, రోజా, హజ్ తోపాటు దైవచింతలతో మెలగాలని కోరారు. యువకులు మట్కా, గుట్కా, సారా, గంజాయి, గ్యాంబ్లింగ్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి సమస్త సమాజం, నవ సమాజం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ శాంతి తో పాటు దేశంలో శాంతి నేలకొల్పడానికి అందరూ ఏకంగా ఉండాలని దేశాభివృద్ధికి కష్టపడాలని విజ్ఞప్తి చేశారు. యువత చెడుదోవ పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అలాగే నిగా పెట్టాలని పేదరిక నిర్మూలన కోసం అందరూ సహకరించాలని ఉపదేశించారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యంతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు కళకళలాడాలని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం పొందాలని, వృద్ధులు , తల్లిదండ్రులు, గురువులు, పెద్దలపట్ల గౌరవభావంతో చూడాలని ఉపదేశించారు. దేశ సమగ్రతకు కట్టుబడి ఉండాలని కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని అన్నారు. దానధర్మాలు, పేదరిక నిర్మూలన చేయడం దేశమే రంజాన్ పండుగ సారాంశం అని పేర్కొన్నారు. యువకుల చెడుదొ వ వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయ ని పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన చెందారు. ఈదుగా ప్రార్థనల్లో ఆయా మసీదుల ముత వల్లీలు, పేస్ మాములు, మాజన్ లు ముస్లిం మత పెద్దలు, ముస్లిం మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థన చేశారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆ లింగనం చేసుకుని రంజాన్ పండుగ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. డి.ఎస్.పి వెంకట్రామయ్య, సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్సై దిలీప్ కుమార్ భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. గజ్జహల్లి, వంద వాగాలి, ఇంగళదహాల్, ఎల్లార్తి, హెబ్బటం, ఎండి హల్లి, సులువాయి, నేరనికి, తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు మసీదులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ముతవల్లిలను, ఇమామ్, మౌజనులను శాలువా కప్పి పూలమాలలు వేసి ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు.