PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరోగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యంగ్ టైగర్ యన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ చంద్ర నార్ని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సినిమా పేరు ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కించారు. ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని నార్ని శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ధూమపానానికి అలవాటు పడ్డ ఒక యువకుడు తన ప్రేమను గెలిపించుకోడానికి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఒరిజినల్ వెర్షన్ లో చాలా మార్పులు చేసి ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రాన్ని మలిచినట్టు తెలుస్తోంది. ఇక హోలీ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

                                     

About Author