PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప : ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు( జూనియర్ ఎన్టీఆర్) 2024 నూతన క్యాలెండర్ను కడప నగరం నందుగల శ్రీ లలితా పరమేశ్వరి దేవస్థానం నందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆదివారం ఆవిష్కరించారు, అంతకుముందు వారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానుల సమక్షంలో నూతన సంవత్సర (2024) ఎన్టీఆర్ కేలండర్లు వారు ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ అభిమాన నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) కు సంబంధించిన క్యాలెండర్లను ప్రతి సంవత్సరం చేయించి వాటిని అటు అభిమానులకు ఇటు వర్తకులకు, ప్రజలకు పంచిపెట్టడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా ఎన్టీఆర్ అభిమానులచే సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో సునీల్, శివ, హరి, రామకృష, సాయి, శ్రీను, విక్రమ్, బన్నీతదితరులు పాల్గొన్నారు.

About Author