PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువ‌తి కిడ్నాప్..

1 min read

– మూడు రోజులైన ఆచూకీ లేదు

హైద‌రాబాద్: బంజారాహిల్స్ లో యువ‌తి కిడ్నాప్ కి గురైంది. మంగ‌ళ‌వారం రాత్రి కిడ్నాప్ జ‌రిగింది. కిడ్నాప్ అయిన యువ‌తి, కిడ్నాప‌ర్ల ఆచూకీ ఇంత‌వ‌ర‌కు తెలియ‌రాలేదు. యువ‌తిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా వివ‌రాలు తెలియ‌డంలేదు. పోలీసులు తీవ్రంగా గాలించిన‌ప్పటికీ కిడ్నాప్ గురైన యువ‌తి స‌మాచారం దొర‌క‌లేదు. మంగ‌ళ‌వారం రాత్రి బంజార‌హిల్స్ లోని ఆల‌మండ్ హౌస్ వెనుక ఉన్న చీక‌టి ప్రాంతంలో ముగ్గరు యువ‌కులు మ‌ద్యం మ‌త్తులో వెళ్తున్నారు. అదే దారిలో వెళ్తున్న యువ‌తి కూడ మ‌ద్యం మ‌త్తులో ఉంది. ఇది గ‌మ‌నించిన యువ‌కులు ఆమెను బ‌ల‌వంతంగా బైక్ మీద ఎక్కించే ప్రయ‌త్నం చేశారు. కానీ, ఆమె కింద ప‌డ‌కుని కేకలు వేసింది. ఆ చుట్టు ప‌క్కల వాళ్లు వ‌చ్చే లోపే బైక్ మీద ఆ యువ‌తిని తీసుకుని ప‌రార‌య్యారు దుండ‌గులు. పోలీసుల‌కు స్థానికులు స‌మాచారం ఇచ్చారు. సీసీ కెమెర ఫుటేజీ ఆధారంగా దుండ‌గుల్ని ప‌ట్టుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు పోలీసులు. అయితే.. ఇంత వ‌ర‌కు కిడ్నాప్ కు గ‌రైన‌ట్టు ఎలాంటి ఫిర్యాదు రాలేద‌ని పోలీసులు చెబుతున్నారు.

About Author