మీ అరెస్టులు… అక్రమ కేసులు మమ్మల్ని ఆపలేవు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గని విడుదల చేసేంతవరకు మా ఈ ఉద్యమాలు ఆగవు:- వై. నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కర్నూల్ లోని మౌర్య ఇన్ హోటల్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయినాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగినది . సమావేశం అనంతరం మోర ఇన్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా కలిసి సర్కిల్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుని విడుదల చేయాలి.చంద్రబాబు నాయుడుని విడుదల చేసింతవరకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలతో పోరాడుతాం. ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించి తిరిగి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసేంతవరకు పోరాడుతాం. ఈ విధమైన అరాచకత్వం, రాక్షసత్వం, చూపిస్తున్న ఈ వైసీపీకి, వైసీపీ ముఖ్యమంత్రి కి తగిన బుద్ధి చెబుతాం. మీ అరెస్టులు అక్రమ కేసులు మమ్మల్ని ఆపలేవు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని విడుదల చేసినంతవరకు మా ఈ ఉద్యమాలు ఆగవు.