NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రా రెడ్డికి మీ మొదటి మద్దతు

1 min read

– ప్రచారంలో పాల్గొన్న చిన్న మల్లారెడ్డి,తులసి రెడ్డి,శివ నాగిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రారెడ్డికి మీ మద్దతు తెలపాలని నందికొట్కూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నమల్లారెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసిరెడ్డి,వైసీపీ మండల నాయకులు మల్లు శివ నాగిరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.మిడుతూరు గ్రామంలో మంగళవారం ఉదయం పట్టభద్రుల ఇంటికి వెళ్లి వారితో వైసిపి నాయకులు మాట్లాడారు.మీ అమూల్యమైన ఓటును వైసీపీ అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా వారు కోరారు.వైకాపా ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని ఇతర పార్టీల వారు చెప్పే మాటలను నమ్మవద్దని ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి సాధ్యమని వారు అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కరపత్రాలను పట్టభద్రులకు అందజేశారు.ఈకార్యక్రమంలో రామ్మోహన్ మరియు బక్కన్న తదితరులు పాల్గొన్నారు.

About Author