మీ అమరత్వం మాదిగ జాతి ఎన్నటికీ మర్చిపోదు
1 min read– మాదిగ అమర వీరులారా అందుకోండి మా జోహార్లు
– వర్గీకరణ సాధించే వరకు అలుపెరుగని పోరాటం చేస్తాం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మాదిగల ఆత్మగౌరవ పోరాటంలో ఏబిసిడి వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మాదిగ అమరు వీరుల ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తూ మీ స్ఫూర్తితో త్వరలోనే వర్గీకరణ సాధించుకుంటామని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమరాజు అన్నారు. బుధవారం నందికొట్కూరులోని ఏబీఎం పాలెంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో కలిసి మాదిగ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ప్రేమ రాజు అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ ఎన్నికల సమయంలో మాత్రమే వర్గీకరణ చేస్తామని అన్ని రాజకీయపార్టీలు మాదిగలను మభ్యపెడుతున్నాయని ఎంతమంది మాదిగలు బలిదానం చేస్తే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ప్రతిపక్ష పార్టీలు సమాదానం చెప్పాలని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల రాజధానులను ముట్టడి ద్వారా అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ నెల 15వ తేదీన జరిగే రాజధానుల ముట్టడి కార్యక్రమంలో ప్రాణాలకు తెగించి అమరవీరుల స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల రాజధానులను ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో జరిగే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం, మాదిగ జాతి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాల పునాదుల పైన వర్గీకరణ సాధించి చరిత్ర నిర్మిస్తామని వర్గీకరణ సాధించేవరకు అలుపెరగని పోరాటం చేస్తామని తెలియజేశారు. అమరవీరుల త్యాగాలు మరవబోమని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద స్వాములు రాజేష్ .వెంకటేష్, .బిసన్న .రాజు .రమేష్ .చిన్న .వెంకట్. శేషు .తదితరులు పాల్గొన్నారు.