మీ పాఠశాల బాగోలేదు.. ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే ఆగ్రహం
1 min read– చదువులో విద్యార్థులు వెనుక బడడంపై ఎమ్మెల్యే సీరియస్
– ఇలాగైతే కుదరదు డిఈఓకు లెటర్ పంపుతా:ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు వెబ మిడుతూరు: మండల పరిధిలోని కలమందలపాడు గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ పాల్గొంటూ ఉండగా మధ్యలో అంగన్వాడీ కేంద్రం,ఎంపీపీ పాఠశాల మరియు జిల్లా పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో జాతీయగీతాన్ని ఒకరు పాడమని విద్యార్థులకు ఎమ్మెల్యే చెప్పగా ఎంపీపీ మరియు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎవరూ జాతీయ గీతాన్ని ఆలపించకపోవడంతో ఎమ్మెల్యే ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ పాఠశాల బాగోలేదంటూ ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయులను మందలిస్తూ ఇలాగైతే కుదరదు మీపై డిఇఓ కు లెటర్ పంపించాల్సి ఉంటుందని ఆయన ఉపాధ్యాయులను హెచ్చరించారు.చదువులో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి వారిని ముందుకు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు.అనంతరం అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేయగా అక్కడున్న చిన్నారులను నెంబర్స్ చెప్పమని ఎమ్మెల్యే అడిగారు.ఒక్కరు తప్ప మిగతావారు ఎవరు చెప్పకపోవడంతో ఆయన వారిపై అసహనం వ్యక్తం చేశారు.అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రంలో బండ పరుపు కృంగి చీలికలు రంద్రాలు ఉండడం పట్ల విష పురుగులు వస్తే చిన్నారులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ఆయన అన్నారు.వీటిని వెంటనే సరి చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.పిల్లలకు చేసిన భోజనాన్ని ఆయన రుచి చూసి తగిన సలహాలు సిబ్బందికి అందజేశారు. అనంతరం మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను ఎమ్మెల్యే ఇండ్లకు అతికించారు.ఈకార్యక్రమంలో నందికొట్కూరు రూరల్ సీఐ జి.సుధాకర్ రెడ్డి,ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి,కమతం వీరారెడ్డి,సాదిక్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.