కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో “యువత పోరు కార్యక్రమం”…!!
1 min read
నంద్యాలలోని ఉదయనంద హోటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ..!!
10నెలల్లోనే కూటమి ప్రభుత్వం పై ఏర్పడిన వ్యతిరేకతకి సాక్ష్యంగా నిలిచిన “యువత పోరు”
కర్నూలు, న్యూస్ నేడు: వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో నిర్వహించిన “యువత పోరు” కార్యక్రమం ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి,మెడికల్ కాలేజ్ లు ప్రైవేటీకరణ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ నంద్యాల జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ” యువత పోరు ” కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి , నంద్యాల మాజీ ఎంపీ పొచ బ్రహ్మానందరెడ్డి ,శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మరియు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ,బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామిరెడ్డి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి ,నందికొట్కూరు ఇన్చార్జి డా.దార సుదీర్ , జిల్లా పరిషత్ చైర్మన్ ఏర్రబోతుల పాపిరెడ్డి భూమా కిషోర్ రెడ్డి కలిసి ర్యాలీగా వెళ్లి నంద్యాల జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు మరియు విద్యార్థి యువజన విభాగం నాయకులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవతం చేశారు.