యువత టిడిపికి మద్దతివ్వడం సంతోషం.. టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని యువకులు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం సంతోషకరమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 4, 5 వార్డులకు చెందిన యువకులు టిడిపి నగర మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. యువత భవిష్యత్తు టిడిపితో ముడిపడి ఉందని టి.జి భరత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిస్తే ఊహించని విధంగా ఉద్యోగావకాశాలు వస్తాయని వివరించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని చెప్పారు. ప్రజల్లో యువత చైతన్యం తీసుకురావాలని ఆయన సూచించారు. పార్టీలో చేరిన వారిలో రాజేష్, అరవింద్, అబ్బాస్, లోకేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బూత్ ఇంచార్జి అనిల్, టిడిపి నాయకురాళ్లు విజయలక్ష్మి, లలితమ్మ, అసెంబ్లీ నియోజకవర్గం మహిళా కమిటీ అధ్యక్షురాలు మారుతీ శర్మ, ఉపాధ్యక్షురాలు సౌభాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.