నన్నూరులో యువకుడు అదృశ్యం..కేసు నమోదు
1 min read
పల్లెవెలుగు, ఓర్వకల్ (మిడుతూరు): కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూరు గ్రామంలోరసిక హరి కుమార్ (సాయి) (23)అనే యువకుడు అదృశ్యమైనట్లు ఓర్వకల్లు ఎస్ఐ సునీల్ కుమార్ శుక్రవారం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు మేరకు హరికుమార్ మరియు తండ్రి ఆంజనేయులు గత 2 నెలల క్రితం వీరిద్దరూ ఆస్తి గురించి గొడవ పడ్డారని వీటిని మనసులో పెట్టుకుని 15 వ తేదీన కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లి సా 4 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉందని ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది స్నేహితులు కుటుంబ సభ్యుల దగ్గర విచారించినా లేక పోవడంతో తండ్రి ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.యువకుడి ఆచూకీ తెలిసినవారు ఓర్వకల్లు ఎస్సై సెల్-9121101067..కర్నూలు రూరల్ సీఐ -91211010165 నంబర్లకు తెలియజేయవచ్చు అని అన్నారు.