PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌వ‌న్ పాత సినిమా కోసం ఎగ‌బ‌డుతోన్న యువ‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పవన్ కళ్యాణ్ సినిమా ‘జల్సా’ మళ్లీ సెప్టెంబర్ 1వ తేదీన (నేడు) విడుదలైంది. అయితే ఒక పెద్ద సినిమా ఎలా విడుదలవుతుందో.. అంత పెద్దగా ఈ సినిమా రీ రిలీజైంది. ముఖ్యంగా యువత ఈ సినిమా చూడటానికి ఎగబడుతున్నారు. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మొదటిరోజు ఒక పెద్ద సినిమా ఎలా వేస్తారో, అలానే ఈ ‘జల్సా’ సినిమాని కూడా 15 షోస్ వేశారు. ఉదయం 8.45 నుండి ఆటలు ప్రారంభమయ్యాయి. కాలేజీ స్టూడెంట్స్ ఇంకా చాలామంది యువత ఈ సినిమాని చూస్తున్నారు. ఈ సినిమా మొదటిసారి విడుదలైనప్పుడు వారంతా 3 ఏళ్ళు లేదా 7 ఏళ్ళు ఉంటాయట. ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద ఈ సినిమా చూస్తున్నాం, మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అద్భుతం ఈ ఎక్స్‌పీరియన్స్ అని అంటున్నారు. ఓటిటిలో చూశాం.., కానీ పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో అనుకునే సమయంలో.. పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా వేశారు.

                                            

About Author