చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి..
1 min read–ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య..
–సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన..
పల్లెవెలుగు, వెబ్ గడివేముల: గురువారం నాడు గడివేముల ఏపీ మోడల్ స్కూల్ లో ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో సైబర్ నేరాలు ఫేక్ లోన్ యాప్స్ డ్రగ్స్ వినియోగంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ అంతర్జాల ఉపయోగాన్ని మంచి కోసం ఉపయోగించాలని మొబైల్ ఫోన్ హ్యాక్, క్రెడిట్ కార్డు సమాచారాన్ని చోరీ, ఓటీపీ మోసాలు, లోన్ యాప్, హానిట్రాప్, ఫిషింగ్ మెయిల్స్, సైబర్ దాడుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎక్కడైనా సైబర్ నేరాలు గురైనట్లయితే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930, డ్రగ్స్ టోల్ ఫ్రీ నెంబర్ 14550, సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ 9121211100, సీఐడీ ఫ్యాక్ట్ ఫైండింగ్ వాట్సాప్ నెంబర్ 9071666667, నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ 112, పోలీస్ డయల్ 100 కు సమాచారం అందించాలన్నారు. ఆపద సమయంలో సహాయం కోసం అభివృద్ధి చేసిన దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు అవగాహన కార్యక్రమంలో మహిళా పోలీస్ అమలేశ్వరి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.