యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి:అడ్వకేట్ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: విద్యార్థులు యువత చెడు మార్గాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే క్రీడలను ప్రోత్సహించాలని అని అడ్వకేట్ వెంకటేష్, క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్, క్రీడలు ఐక్యతకు సంకేతమని విద్యా కమిటీ చైర్మన్ మద్దిలేటి లు అన్నారు. మండల కేంద్రమైన గోనెగండ్ల లోని ఎస్సీ కాలనీ కు చెందిన యువకులు గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని అడ్వకేట్ వెంకటేష్ నిర్వహణలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ వెంకటేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్, హరిజనవాడ స్కూల్ కమిటీ చైర్మన్ మద్దిలేటి లు మాట్లాడుతూ యువత క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చెడు మార్గాలకు దూరంగా ఉండాలని అడ్వకేట్ వెంకటేష్ అన్నారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని, స్నేహభావాన్ని, ఆనందాన్ని ఇస్తాయన్నారు. ఒక్కరిలో కృషి పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు అన్నారు. క్రీడల ద్వారా క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. అనంతరం హరిజనవాడ స్కూల్ కమిటీ చైర్మన్ మద్దిలేటి మాట్లాడుతూ క్రీడలు ఐక్యతకు సంకేతం అని ఎలాంటి అసూయా ద్వేషాలు లేకుండా ఆటల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని అన్నారు.అనంతరం క్రికెట్ పోటీల యందు విజేతగా నిలిచిన విజేత టీం సభ్యులకు అడ్వకేట్ వెంకటేష్ అందజేశారు. అనంతరం ఈ కార్య నిర్వహణ కు దాతగా సహకరించిన అడ్వకేట్ వెంకటేష్ ను క్రీడాకారులు శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు నాగేష్, రవి, నరసింహుడు , నాగరాజు, తేజ, అశోక్, తిక్కయ్య తదితరులు పాల్గొన్నారు.