క్రీడల పట్ల యువత ప్రత్యేకత వహించాలి
1 min read-“ఆడుదాం ఆంధ్ర “సమావేశంలో
– మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ వెంకటసుబ్బయ్య
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: క్రీడలు యువత మానసిక ఉల్లాసానికి ఎంతో దొరక పడతాయని, అలాగే ఆటల ద్వారా శరీర దృఢత్వంతో పాటు శారీరక ఎదుగుదల కు తోడ్పాటు ఇస్తాయని మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ వెంకటసుబ్బయ్య, ఎంపీడీవో గంగన పల్లె సురేష్ బాబు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు అన్నారు, గురువారం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నందు ఆడుదాం ఆంధ్ర’ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం నకుముఖ్య అతిధిగా హాజరైనటువంటి మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ వెంకట సుబ్బయ్య ఆడుదాం ఆంధ్ర’ టోర్నమెంట్ కు సంబంధించి మండల స్థాయి కమిటిలను ఏర్పాటు చేయడం జరిగింది, ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ నిర్వహించవలసిన విధానం గురించి ఆయన వివరించారు., సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ప్లేయర్స్ ను ఆన్లైన్ నందు నమోదు చేయవలసి ఉంటుందనీ, గ్రామ స్థాయిల్ లో ప్రతీ ఇంటికి ఈ సమాచారం చేరవేసి వీలైనంత ఎక్కువ మంది ప్లేయర్స్ నమోదు అగునట్లు చూడవలసి ఉంటుందని ఆయన తెలియజేశారు, మండల తహశీల్దారు పఠాన్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నందు 5 రకాల గేమ్స్ ఉంటాయని తెలియజేశారు, అవి. ఖోఖో, కబడ్డి, బాడ్మింటన్, క్రికెట్ ప్రతీ ఆటల నందు పాల్గొనవలసిన ప్లేయర్స్ సంఖ్యను ఎక్కువగా వచ్చే విధంగా చూడాలని ఆయన తెలియజేశారు, ఈ సమావేశంనకు అధ్యక్షత వహించిన మండల అభివృద్ధి అధికారి సురేష్ బాబు మాట్లాడుతూ 17 సం|| నిండిన యువతి యువకులు ఈ టోర్నమెంట్లకు అర్హులనీ సచివాలయాల పరిధిలో ఈ టోర్నమెంట్ లు జరుగుతాయని, ఒక ప్లేయర్ 2 గేమ్స్ ఆడే అర్హత కల్గి ఉంటారని ఇది నాకేట్ గేమ్ అని, ఆన్లైన్ చేసుకోవడానికి ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 25 వరకు ఉంటుందని ఆయన తెలియజేశారు, మండలాధ్యక్షులు చీర్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించి విజయవంతం చేయాలనీ తెలిపారు, మండల విద్యాశాఖాధికారి గంగిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ టోర్నమెంట్లలో పాల్గొనవ చ్చుననీ, PD లు స్పోర్ట్స్ కోటానందు ఉద్యోగం పొందిన వారు అనర్హులని తెలిపారు, మండల విద్యాశాఖాధికారి – II శ్రీమతి సునీత మాట్లాడు తూ ఈ టోర్నమెంట్ అక్టోబర్ 2 నుండి 8 వరకు సచివాలయ పరిధిలో, 9 నుండి 23 తేదీ వరకు – మండల స్థాయిలో 24 వ తేదీ -29 వరకు నియోజక వర్గ స్థాయిలో అక్టోబర్ 30 నుండి నవంబర్ -౦౩ వరకు జిల్లా స్థాయిలో జరుగునని కమిటిల బాద్యతలను గురించి తెలిపారు. ఈ కార్యక్రమం నందు మండల స్థాయి అధికారులు, ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాద్యాయులు,vroలు ,పంచాయతీ సెక్రటరిలు ,మెడికల్ ఆఫీసర్లు డిజిటల్ అస్సిస్టెంటలు తదితరులు పాల్గొన్నారు.