PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వయం ఉపాధిలో యువత రాణించాలి

1 min read

– స్టార్ ఫ్లెక్సీ ప్రింటింగ్ ను ప్రారంభించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: స్వయం ఉపాధి అవకాశాలు దక్కించుకుంటూ యువత అభివృద్ధి పథంలో రాణించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.నందికొట్కూరు పట్టణంలోనీ కొత్త బస్టాండ్ సమీపంలో   శనివారం  నూతనంగా  ఏర్పాటుచేసిన  ప్రణయ్ స్టార్ట్ ఫ్లెక్సీ ప్రింటింగ్   నిర్వాహకులు  ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ ,  హర్షపోగు ప్రణయ్ కుమార్, హర్షపోగు చిన్నరాజు ల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా  మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణయ్ స్టార్ ఫ్లెక్సీ ప్రింటింగ్  నిర్వాహకులు ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ , హర్షపోగు ప్రణయ్ కుమార్, హర్షపోగు చిన్న రాజు లు  మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి  పూలతో  బాణసంచా పేలుస్తూ  ఘన స్వాగతం పలికారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రారంభోత్సవం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు కార్యకర్తలు  భారీగా తరలివచ్చారు.అనంతరం నిర్వాహకులు ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ కుటుంబ సభ్యులను  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  అభినందించారు. అదేవిధంగా  జీవనోపాధిగా ఎంచుకున్న ఫ్లెక్సీ ప్రింటింగ్  వ్యాపార రంగంలో  దినదిన అభివృద్ధికి నోచుకొని రాణించాలని  వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు రవికుమార్ రెడ్డి, గూడూరు శివారెడ్డి, బైరెడ్డి, డా.కరీం, కొండెపోగు సుంకన్న, నాగలూటి గోకరి,  కొణిదెల గోపాల్,     రాజశేఖర్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు మరియు ప్రణయ్  ఫ్లెక్సీ ప్రింటింగ్ నిర్వాహకుల కుటుంబీకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

About Author