PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి…

1 min read

– జి ఎం డి రఫీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను  ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

పల్లెవెలుగు  వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని కడప రింగ్ రోడ్డు బృందావనం  సమీపంలో ఏర్పాటు చేసిన జి ఎం డి రఫీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంబింపచేశారు. టాస్ వేసి క్రికెట్ పోటీలను శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులును ఆయన పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపు బ్యాటింగ్ ఆడి అటు క్రీడాకారులను ,యువకులను ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి లో త్వరలో క్రికెట్ స్టేడియం పనులను పూర్తి చేయిస్తామన్నారు.యువత విద్యతో పాటు క్రీడా రంగంలో మంచి నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలన్నారు.   రాయచోటు ప్రాంత క్రీడాకారులు చక్కటి ప్రదర్శనలు ఇచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీ ప్రదర్శనలు తీయాలని , భవిష్యత్తులో ఇలా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి  రాయచోటి ప్రాంతానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే , ఓడిపోయినా నిరుత్సాహం పడకూడదు. గెలిచాము అని గర్వపడవద్దన్నారు. స్నేహపూర్వకంగా క్రీడలను ఆడాలని, ఓడిపోయినా ఓటమి విజయానికి నాందిగా భావించాలన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు జి ఎం డి ఇమ్రాన్,ఇర్షాద్ లు మాట్లాడుతూ తమ తండ్రి, మాజీ ఎంపిపి జి ఎం డి రఫీ జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ ను నేటి నుంచి ఈ నెల 28 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.టోర్నీవిజేతలకు మొదటి బహుమతిగా రూ59,999, రెండవ బహుమతిగా రూ 30,999 లు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు ఫయాజ్ బాష,ఫయాజుర్ రెహమాన్,సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి,  మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్,మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, కౌన్సిలర్లు సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,సుగవాసి శ్యా,బిసి సెల్ విజయభాస్కర్,కో ఆప్షన్ సభ్యులు అయ్యవారు రెడ్డి,హజరత్ ఖాదర్ వలీ,నాయకులు శిద్దారెడ్డి,మల్ రెడ్డి,కొత్తిమీర ప్రసాద్,ముదిరాజ్ యువసేన జిల్లా అధ్యక్షుడు విక్కీ దేవేంద్ర,కొత్తపల్లె ఇంతియాజ్,  జావీద్,అమీర్, మాజ్,ఫకీరా,జూల్ ఫక్రుద్దీన్,చాను, మస్తాన్,పూణే అమీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author