యువత ఉద్యోగం ఆశించకూడదు .. !
1 min readపల్లెవెలుగువెబ్ : నిరుద్యోగ సమస్య పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం ఆశించేవాళ్లుగా కాకుండా ఉద్యోగం కల్పించేవాళ్లుగా యువతను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై ఆయన స్పందిస్తూ దేశంలో 52.5 కోట్ల మంది 23 ఏళ్లలోపు వారేనని, వీరిలో 35 శాతం మంది విద్యా, నైపుణ్యాలు కలిగిన వారని, వీరిని కేవలం ఉద్యోగం ఆశించేవాళ్లుగా కాకుండా ఉద్యోగం కల్పించేవాళ్లుగా తీర్చిదిద్దితే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.