PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుసమస్యలపై యువతస్పందించాలి

1 min read

– గొట్టిపాటిరామకృష్ణప్రసాద్

– రైతులకుకాళ్ళుకడిగి సత్కారం.

 – కారంపూడిపౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ పాల్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపట్ల రైతుకు జరుగుతున్న అన్యాయాలపట్ల పరిష్కారం చూపే దిశగా యువత ముందుకు వచ్చి ఆలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు కారంపూడి ఫౌండేషన్ వార్షికోత్సవ కార్యక్రమంలో రైతుల సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీనియర్ జర్నలిస్ట్ అప్పల భక్తుల శివకేశవరావు( శివశ్రీ) అధ్యక్షతవహించిన  ఈ కార్యక్రమంలో కారంపూడి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారంపూడి విజయ్ రైతులకు కాళ్ళుకడిగి నూతన వస్త్రాలు బహుకరించి దుశ్శాలువాతో   సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కారంపూడి ఫౌండేషన్ వార్షికోత్సవ సందర్భంగా రైతులకు అండగా నిలిచేందుకు నిర్ణయించుకోవడం అభినందనీయమన్నారు. రైతులకు సంబంధించినన్ని నినాదాలు మరి ఎవరికి రాలేదన్నారు ఆ నినాదాలు చూసి రైతులు మురిసిపోయారని కానీ వారి కలలు కల్లలుగానే మిగిలాయని అన్నారు. దేశంలో ఏ చట్టం తెచ్చినాఅంతిమంగా రైతుకు నష్టం జరుగుతునే ఉంది తప్ప ఎటువంటి న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తానుముప్పై ఏళ్లుగా రైతుల సమస్యలను గమనిస్తున్నానని రైతు మాత్రమే  సంవత్సరం అంతా కష్టపడి ఫలితం కోసం ఎదురు చూస్తాడని అయితే రైతు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాడని ఆయన పేర్కొన్నారు. రైతు కేవలం తాను కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరను మాత్రమే కోరుకుంటాడని అన్నారు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించే దిశగా యువత ముందుకు వచ్చి ఆలోచన చేయాలని రైతు సమస్యలు  పరిష్కారానికి నోచుకోవడానికి ఎవరి పాత్ర ఎంతో పరిష్కరించాలంటే ఏం చేయాలో సమగ్రంగా విద్యావంతులైన యువత అధ్యయనం చేయాలన్నారు. మన గ్రామంలో మన కళ్ళ ముందే అన్నీ జరిగిపోతున్నాయని ఏ ప్రభుత్వం వచ్చినా ముందుగా మాట్లాడేది రైతులు గురించేమాట్లాడుతుందని  సమస్యలు మాత్రం ఎక్కడివి అక్కడే ఉంటున్నాయని ఆయన ఆరోపించారు సమస్యను గుర్తించడం అధ్యయనం చేయడం పరిష్కారం చూపడం ఇందుకోసం కృషి చేయడం ఇదే రైతుకుచేసే మేలు అన్నారు కారంపూడి ఫౌండేషన్ చైర్మన్ విజయపాల్ మాట్లాడుతూ కరోనా వంటి కష్టకాలంలో మిగిలిన వ్యవస్థలన్నీ విశ్రాంతి తీసుకున్నప్పటికీ రైతు మాత్రం శ్రమించి దేశానికి ఆహారాన్ని పండిస్తూనే ఉన్నాడన్నారు మిగిలిన వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు వారసత్వంగా తండ్రి ఏ వ్యాపకంలో ఉంటే కొడుకు ఆ వ్యాపకంలో కొనసాగుతున్నాడని  రైతు కొడుకు వ్యవసాయంలోకి రావడం లేదన్నారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో విద్యార్థులతో కలిపి రైతాంగ సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారం కోసం కారంపూడి ఫౌండేషన్ సమిష్టి కృషి చేస్తుందని ఆయన ప్రకటించారు వివిధవృత్తులవారికి పెన్షన్ సదుపాయంకల్పిస్తున్న ప్రభుత్వాలు రైతుకు ఎందుకు పెన్షన్ సదుపాయంకల్పించదనిప్రశ్నించారు దేశానికి అన్నంపెట్టే రైతులకు 5వేలరూ పెన్షన్ ఇవ్వాలని ఇందుకోసం యువతను రైతాంగాన్నికలుపుకుని పోరాడతామన్నారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందన్నారు వ్యవసాయం లాభసాటి గానే ఉన్నప్పటికీ రైతు మాత్రం నష్టాల్లో కూరుకు పోతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు భూ యజమాని సంతకం పెడితే తప్ప కవులు రైతుకు కార్డు మంజూరు కావడం లేదన్నారు కౌలు రైతు కాడి కింద పడేస్తే దేశంలో ఆహార సంక్షోభం తప్పదని ఆయన పేర్కొన్నారు. స్వామినాథన్ కమిషన్  పెట్టుబడికి రెట్టింపు ధరను గిట్టుబాటు ధరగా నిర్ణయించాలని పేర్కొన్నప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవ ఉత్పత్తికి 50% అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించాలని మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పిడిఎస్ యు విద్యార్థి సంఘం నాయకుడు కాకినాని యువజన సంఘం నాయకులు అబ్బూరి అనిల్ పలువురు రైతులు పాల్గొని ప్రసంగించారు.

About Author