NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత చూపు.. బీఎస్పీ వైపు

1 min read

– గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లో జిల్లా నాయకుల పర్యటన

– బహుజన సమాజ్ పార్టీలో చేయడానికి ఆసక్తి చూపుతున్న యువత

పల్లెవెలుగు వెబ్ అనంతపురం : బహుజన సమాజ్ పార్టీలో చేరడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికార సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న బహుజన సమాజ్ పార్టీలో చేరడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఆ పార్టీఅనంతపురం జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం,  బామ్ సేఫ్ జిల్లా కన్వీనర్ డాక్టర్ రంగస్వామి, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి కొత్తూరు లక్ష్మీనారాయణ  ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి సైనికుల్లా పని చేస్తామని ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికారం దక్కాలంటే బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యం అన్నారు. బాంసేపు జిల్లా కన్వీనర్ డాక్టర్ రంగస్వామి మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ దేశంలోనే మూడవ జాతీయ పార్టీ అని, ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై రాజ్యాధికారాన్ని సాధించే విధంగా ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. అనంతపురం జిల్లా ఇన్చార్జి కొత్తూరు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని,  అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేసే అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు బహుజన సమాజ్ పార్టీ నాయకులు,  యువకులు పాల్గొన్నారు.

About Author