యూట్యూబ్ కత్తెర !
1 min readపల్లెవెలుగువెబ్ : యూట్యూబ్‌లో సెన్సారింగ్ భారీగానే జరుగుతోంది. సెన్సార్ కు గురైన వీడియోల సంఖ్యలో భారతదేశం అమెరికాను మించిపోయింది. మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పెద్దగా ఎవరూ చూడకముందే ఇండియాలో 11,75,859 వీడియోలను బ్లాక్ చేసినట్లు యూట్యూబ్ వెల్లడించింది. వీటిల్లో ఎక్కువగా పిల్లల భద్రత, హింసాత్మక కంటెంట్, అశ్లీల వీడియోలు ఉన్నట్లు సంస్థ తెలియజేసింది. ఇటీవల యూట్యూబ్ సంస్థ కమ్యూనిటీ మార్గదర్శకాల ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికను విడుదల చేసింది.