NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ జ‌గ‌న్ కు మిన‌హాయింపు ఇవ్వొద్దు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జ‌గ‌న్ హాజ‌రు మిన‌హాయింపు పై సీబీఐ కీల‌క వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో జ‌గ‌న్ కు మిన‌హాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ హైకోర్టుకు తెలిపింది. జ‌గ‌న్ కు మిన‌హాయింపు ఇస్తే సాక్ష్యాల‌ను తారుమారు చేసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. సాక్షుల‌ను ప్రభావితం చేస్తార‌నే గ‌తంలో హాజరుకు మినహాయింపున‌కు నిరాక‌రించిన‌ట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ప‌దేళ్ల‌యినా ఇంకా డిశ్చార్జీ పిటిష‌న్ ద‌శ‌లోనే ఉన్నాయ‌ని కోర్టుకు విన్నవించింది. జ‌గ‌న్ హాజ‌రుకు మిన‌హాయింపు ఇస్తే విచార‌ణ మ‌రింత జాప్యం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని సీబీఐ స్పష్టం చేసింది. సీబీఐ వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం తీర్పును రిజ‌ర్వ్ లో ఉంచింది.

About Author