PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ జీవితకాల అధ్య‌క్షుడిగా వైఎస్ జ‌గ‌న్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జీవిత కాల జాతీయ అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తల కరతాళధ్వనుల మధ్య ప్లీనరీ రెండో రోజు శనివారం పార్టీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. మొదటి రోజు నిర్వహించిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలో వైఎస్‌ జగన్‌ తరఫున 22 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతరులెవరూ నామినేషన్లు వేయలేదు. దాంతో పార్టీ జీవిత కాల జాతీయ అధ్యక్షునిగా వైఎస్‌ జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

                             

About Author