మైనార్టీల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్
1 min read– కమలాపురం నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ అన్వర్ సాబ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూర్ : మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పాటుబడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కమలాపురం నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ అన్వర్ సాబ్ అన్నారు, శుక్రవారం ఆయన స్థానిక వైయస్సార్సీపి కార్యాలయంలో మైనార్టీ నాయకులతో కలసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో నాలుగు మండలాలలో మైనార్టీల షాది ఖానాల కొరకు నిధులు మంజూరు మైనార్టీల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీల అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కొనియాడారు, చెన్నూరు మండలంతో పాటు సీకే దీన్నే మండలం, పెళ్లి మరి మండలం, కమలాపురం మండలాల మైనారిటీలకు 50 లక్షల రూపాయల తో షాదీఖానాలు మంజూరు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి, ఎంపీ అవినాష్ రెడ్డికి రుణపడి ఉంటామని ఆయన ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు, మైనార్టీల కు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 4% శాతం రిజెర్వేషన్ కల్పిస్తే ఆయన తనయులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహనరెడ్డి మైనారిటీలకు అంతకు మించి షాదీతోఫా తో పాటు వారి పిల్లలకు అమ్మఒడి, విద్యదీవెన ,వసతిదీవెన మౌజాంలకు 6 వేలు ఇమామ్లకు 10 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు, ఇంత చేస్తున్న ముఖ్యమంత్రికి మైనార్టీలు అందరూ కూడా రుణపడి ఉంటారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కరీం, మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్, ఎంపీటీసీ సాధిక్ అలీ, మాజీ ఎంపీటీసీ మునీర్ అహ్మద్, స్కూల్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రబ్, హస్రత్, వార్డ్ మెంబెర్ ఖరాంతుళ్ళ, సీనియర్ నాయకులు చోట , సయ్యద్ నూర్, మొహమ్మద్ , తదితర నాయకులు పాల్గొన్నారు.