వైఎస్ జగన్ మమ్నల్ని బెదిరించారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : బీఏసీలో సీఎం జగన్ మమ్మల్ని బెదిరించారన్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. తాము వేటినీ లెక్కచేయమన్నారు. గవర్నర్‌ని అగౌరవపరచలేదని, రాజ్యాంగ వ్యవస్థల్ని కించపరుస్తున్న గవర్నర్‌ని మాత్రమే గోబ్యాక్ అన్నామని తెలిపారు. వయస్సు గురించి వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని పయ్యావుల అన్నారు. చంద్రబాబును అసెంబ్లీలో అవమానించినప్పుడు.. వైసీపీ నేతలకు వయస్సు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు శాశ్వతంగా హైదరాబాదే రాజధాని అని అన్నారు. నాలుగో రాజధానిగా హైదరాబాద్‌ను పెట్టుకుంటారేమో? అని అనుమానం వ్యక్తం చేశారు.