‘వైఎస్’ మంత్రులకు.. విజయమ్మ పిలుపు !
1 min readపల్లెవెలుగు వెబ్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సెప్టంబర్ 2న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారికి వైఎస్ విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్, మాజీ స్పీకర్ కే.ఆర్. సురేష్ రెడ్డితో పాటు అప్పట్లో వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన వారికి విజయమ్మ ఫోన్ చేశారు. సెప్టంబర్ 2న వైఎస్ఆర్ 12వ వర్దంతి. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నప్పటికీ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. మరోవైపు షర్మిల పార్టీ వైఎస్ ఆర్టీపీ పార్టీ కార్యక్రమాల్లో కూడ పాల్గొంటున్నారు.