NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ వివేక హ‌త్య కేసు.. విచార‌ణ‌కు వైకాపా నేత‌లు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది. క‌డ‌ప సెంట్రల్ జైల్ వేదిక‌గా అత్యంత గోప్యంగా విచార‌ణ సాగుతోంది. ఇటీవ‌ల అనుమానితుల‌ను, వివేకా సన్నిహితుల‌ను విచారించిన సీబీఐ.. ఇప్పుడు వైకాపా నేత‌ల‌ను కూడ విచార‌ణ‌కు పిలిచింది. క‌డ‌ప జిల్లా చిట్వేలి మండ‌ల వైకాపా నేత‌లు ల‌క్ష్మీక‌ర్, ర‌మ‌ణ‌.. సింహాద్రిపురం మండ‌లం సుంకేశుల గ్రామానికి చెందిన వైకాపా నేత జ‌గ‌దీశ్వర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. మంగ‌ళ‌వారం వైఎస్ వివేకాకు అత్యంత స‌న్నిహితుడైన సునీల్ కుమార్ యాద‌వ్ తండ్రి కృష్ణయ్య యాద‌వ్ ను విచారించారు. వివేకాతో ఎలా మెలిగేవారు, ఎన్నిగంట‌ల‌కు ఇంటికి వచ్చే వారు అని ప్రశ్నించారు. వివ‌రాల‌ను మాత్రం న‌మోదు చేసుకుని, విచార‌ణ‌ను సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

About Author