పార్టీ కమిటీలను రద్దు చేసిన వైఎస్ షర్మిల !
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీ కమిటీలన్నీ రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. పాత కమిటీల స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది పార్టీ ఏర్పాటు తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లు, రాష్ట్రస్థాయిలో అధికార ప్రతినిధులు, సోషల్ మీడియాతో పాటు పలు విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కమిటీలను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.