జగ్గారెడ్డి ఛాలెంజ్ కు భయపడబోనన్న వైఎస్ షర్మిల
1 min read
పల్లెవెలుగువెబ్: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మంగళవారం షర్మిల మరోమారు ఘాటుగా స్పందించారు. జగ్గారెడ్డి తనను బెదిరించినట్లుగా మాట్లాడారట అంటూ మొదలుపెట్టిన షర్మిల… జగ్గారెడ్డి చాలెంజ్‌కు తాను భయపడబోనని అన్నారు. జగ్గారెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆమె అన్నారు. తన తండ్రి చనిపోయిన రోజు జగ్గారెడ్డి పరామర్శకు వస్తే తాము రాజకీయాలు మాట్లాడామని ఆయన అన్నారని షర్మిల మండిపడ్డారు. నాడు తమ కుటుంబం పడిన బాధ తమకే తెలుసునన్నారు. అసలు తాము బతుకుతామా? చస్తామా? అన్నట్లుగా బాధపడ్డామన్నారు. అసలు తనకు చాలెంజ్ విసరడానికి జగ్గారెడ్డి ఎవరు? అని కూడా షర్మిల ప్రశ్నించారు.