NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పుస్తకాన్ని విడుదల చేసిన వైఎస్ షర్మిల

1 min read

పల్లెవెలుగు వెబ్ తెలంగాణ:  రాజకీయ విశ్లేషకులు పాల్వాయి రాఘవేంద్ర రెడ్డి రచించిన “RESONANCE OF DEMOCRACY, a book of Telangana Assembly Elections 2023” పుస్తకం, గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై లోతైన విశ్లేషణను నిక్షిప్తపరిచింది- జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల సమరాన్ని సమగ్రంగా వివరిస్తాయి ఇందులోని విశేషాలుప్రస్తుత రాజకీయ పరిస్థితులను, విశేషాలను నిస్పాక్షికతతో, విశ్లేషణాత్మక ధోరణితో ప్రజలముందుకు తీసుకువచ్చే విధంగా మరిన్ని రచనలు రావాలని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. నగరానికి చెందిన రాజకీయ విశ్లేషకులు పాల్వాయి రాఘవేంద్ర రెడ్డి, క్రిందటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై  రచించిన “RESONANCE OF DEMOCRACY, a book of Telangana Assembly Elections 2023” పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆవిడ ఇలా అన్నారు.ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ రాఘవేంద్ర రెడ్డి ఇలా అన్నారు: “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నెలకొన్న ఒక విశిష్టమైన అనిశ్చితి, పార్టీల ముందు ఉన్న ప్రత్యేకమైన సవాళ్లు చూసాక నాకు ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన వచ్చింది. దేశవ్యాప్తంగా అందరినీ విశేషంగా ఆకర్షించిన 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం, ఎన్నికలను ప్రభావితం చేసిన కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అలాగే కొందరు రాజకీయ నేతలు, వీటన్నిటినీ సమగ్రంగా అందజేసే ప్రయత్నం ఈ పుస్తకంలో కనపడుతుంది.

About Author