వైఎస్ వివేక హత్య కేసు నిందితుల్ని చంపే కుట్ర !
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్గా ఉన్న వరుణ్రెడ్డిని.. ఇప్పుడు కడప జైలర్గా నియమించారని తెలిపారు. దీనిపై సీబీఐకి లేఖ రాస్తామని, కడప జైల్లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణహానీ ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.