వైఎస్ వివేక హత్య కేసు.. ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్
1 min readపల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ3 నిందితుడు ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కడప కోర్టు కొట్టివేసింది. ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. వివేకా కేసులో ఉమా శంకర్రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నా డని సీబీఐ వాదనలు వినిపించింది. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈ సమయంలో..ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ తిరస్కరించాలని కోరింది. సీబీఐ వాదనతో కడప కోర్టు ఏకీభవించింది. ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది.