చంద్రబాబు చేతిలో వైఎస్ సునీతరెడ్డి పావుగా మారింది !
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ వివేకా హత్యపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. “ వివేకా హత్య కేసులో రాజకీయరంగు పులిమి విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. ఎంత బురదజల్లుతున్నా ఇంతకాలం ఓపిగ్గా ఉన్నాం. వివేకా సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం దారుణం. ఎలాంటి ఆధారలు లేకుండా సునీత ఆరోపణలు చేస్తున్నారు. సునీత చంద్రబాబు చేతిలో పావుగా మారారని అనిపిస్తోంది. వివేకా హత్యపై రోజుకో ఆరోపణ చేస్తున్నారు. ఎల్లో మీడియా దిగజారుడు కథనాలు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తోంది పూర్తిగా రాజకీయ కుట్రే. ఒకరి తర్వాత ఒకరు పద్దతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు. కుట్ర పూరితంగా వెనకుండి చంద్రబాబే నాటకమాడిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోంది. కనీసం సిగ్గూ, ఎగ్గూ లేకుండా కథనాలు ప్రచారం చేస్తున్నారు. చనిపోయిన వివేకా ఆత్మక్షోభించేలా వ్యవహరిస్తున్నారు.“ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.