NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రొద్దుటూరు కోర్టుకి వైఎస్ వివేకా మాజీ డ్రైవ‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మాజీమంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోబోతోంది. వివేకానంద‌రెడ్డి మాజీ డ్రైవ‌ర్ ద‌స్తగిరిని ఇవాళ క‌డ‌ప నుంచి ప్రొద్దుటూరు కోర్టుకు సీబీఐ అధికారులు త‌ర‌లించారు. కేసు విచార‌ణ‌లో భాగంగా ద‌స్తగిరిని ప్రొద్దుటూరుకు త‌ర‌లించిన‌ట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ప్రొద్దుటూరు కోర్టులో 164 సెక్షన్ కింద మేజిస్ట్రేట్ ముందు ద‌స్తగిరి వాంగ్మూలం ఇవ్వనున్నట్టు స‌మాచారం. ఈ కేసుకు సంబంధించి వివేకానంద‌రెడ్డి ఇంటి వాచ్ మెన్ రంగ‌య్య జ‌మ్మల‌మ‌డుగు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు ద‌స్తగిరి వాంగ్మూలం కూడ న‌మోదు చేయ‌నున్న నేప‌థ్యంలో కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది. దీంతో ఈ కేసు విష‌య‌మై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది.

About Author