NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌డ‌ప ఎస్పీని భ‌ద్రత కోరిన వైఎస్ వివేకా కుమార్తె

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌డ‌ప ఎస్పీ అన్బురాజ‌న్ ను వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత క‌లిశారు. క‌డ‌ప జిల్లా ఎస్పీ కార్యాల‌యానికి చేరుకున్న ఆమె ఎస్పీతో భేటీ అయ్యారు. పులివెందుల‌లోని త‌న నివాసం వ‌ద్ద భ‌ద్రత క‌ల్పించాల‌ని కోరారు. త‌మ కుటుంబానికి ప్రాణ‌హాని ఉన్న నేప‌థ్యంలో త‌మ కుటుంబ‌ స‌భ్యుల‌కు భ‌ద్రత క‌ల్పించాల‌ని ఆమె ఎస్పీని కోరారు. వైఎస్ వివేకా హ‌త్య కేసు విచార‌ణ గ‌త 8 రోజులుగా క‌డ‌ప జిల్లా సెంట్రల్ జైల్ వేదిక‌గా జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వ్యక్తులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఒక‌వైపు విచార‌ణ సాగుతుండ‌గా.. వైఎస్ సునీత భ‌ద్రత కోర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

About Author