వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ విశ్వసనీయతకు సవాల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : వివేకా హత్య కేసుతో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరు చనిపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శ్రీనివాస రెడ్డి, గంగిరెడ్డి, గంగాధర్ రెడ్డిల వరుస మరణాల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్లని చంపేస్తారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. ఇప్పుడు అదే జరుగుతోందని, వాళ్లు కరుడుగట్టిన నేరగాళ్లని.. పరిటాల రవి విషయంలో ఇలాగే చేశారన్నారు. ‘సీబీఐకి ఇది సవాల్.. సీబీఐ విశ్వసనీయతకే పెను సవాల్’ అని చంద్రబాబు అన్నారు. జగన్ అవినీతిపై సీబీఐ ఛార్జ్ షీట్ వేసినా ఏం చేయలేకపోయిందన్నారు. సీబీఐ ఏం చేయలేకపోతుంటే.. ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. నేరగాళ్లు రాజ్యం చేస్తోంటే సీబీఐ వంటి సంస్థలు కాపాడకుంటే ఎలా..? అని నిలదీశారు.