వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం గెలుపుకు కృషి చేయాలి : ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలో అందించే నిజమైన నాయకుడు.ఇచ్చిన మాటను నెరవేర్చే గొప్ప నాయకుడు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం నవరత్నాలను. ఇప్పటికే 95 శాతం నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అనడంలో అతిశయోక్తి లేదు.చంద్రబాబు నాయుడుకి, మన నాయకుని కి తేడా గమనించాలన్నారు శనివారం నాడు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గడివేముల పాణ్యం మండలాల వార్డ్ కన్వీనర్లు,గృహ సారధుల తో సమావేశం నిర్వహించారు తమ గ్రామ పరిధిలో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి గత ప్రభుత్వానికి మన జగనన్న ప్రభుత్వానికి తేడా ఉందా,లేదా అనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు చూసి ఈసారి మీరు మా జగనన్నను ఓటేయాలని అవగాహన కల్పించాలన్నారు,ఒకటో తేదీ ఉదయాన్నే నిద్ర లేపి వాలంటీర్ల రూపంలో జగనన్న అవ్వా తాతలకు ఇస్తున్నారని కావున మీరు జగనన్నకు తోడుగా ఉండాలని,2024 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని తెలిపారు మన ప్రభుత్వానికి మీడియా సహకారం లేదని ఒక్క సాక్షి పత్రిక మాత్రమే మనకు తోడుగా ఉందని గమనించాలన్నారు. చంద్రబాబు అధికారంలో రావడానికి ఎన్నో కుట్రలకు తెరలెప్పుతారని అందరం సమిష్టిగా కృషి చేస్తేనే మనం అధికారంలో రావడానికి అవకాశం ఉంటుందన్నారు ఈ సందర్భంగా కొంతమంది నాయకులు ప్రజలకు మేలు చేసే పథకాలతో వారి జీవన విధానాన్ని మార్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను నాయకులను గుర్తించాలని మన ప్రభుత్వ హయాంలో పనులు చేసి ఇప్పటివరకు బిల్లులు రాక వడ్డీల మీద వడ్డీలు కడుతూ కష్టాల్లో ఉన్నామని పనులు చేసిన వాటికి బిల్లులు మంజూరయ్యేలా ఎమ్మెల్యే చొరవ చూపాలని పెడుతున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల ఆఖరి కల్ల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తారని కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇచ్చారు గడివేముల జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో రెండు మండలాలు అటు రెండు మండలాలు ఇటు ఉండడంతో తమ మండలంలో చేసే పనులపై అధికారులతో పరిపాలన సౌలభ్యం గాడి తప్పిందని కర్నూలు జిల్లాలోని గడివేముల మండలాలను కలిపితే అధికారులు ఎమ్మెల్యే కర్నూల్ లోనే ఉంటారని సమస్యలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుందని ఈ దిశగా ఎమ్మెల్యే గారు ఆలోచించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రెండు మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మండల స్థాయి వైకాపా నాయకులు కన్వీనర్లు కోకన్వీనర్లు గృహసారథులు పాల్గొన్నారు.