బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది వైసిపి ప్రభుత్వం
1 min read– వై.నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కడప కార్పొరేషన్ 16వ డివిజన్ మామిళ్ళపల్లి గ్రామంలో కడప జిల్లా యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు యాదవ్ గ,స్టేట్ మెంబర్ నరసింహులు యాదవ్ ఆధ్వర్యంలో యాదవ పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంతెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్వై .నాగేశ్వరరావు యాదవ్ అధ్యక్షతన నిర్వహించగా,ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంగాధర్ ,కృష్ణారెడ్డి,మాజీ ఎంపిటిసి సుబ్బ నరసయ్య ,17 డివిజన్ ఇంచార్జ్ మునేంద్ర నంద్యాల నాయకులు గుర్రప్ప యాదవ్,శీను యాదవ్ , వెంకటసుబ్బయ్య ,వెంకటయ్య కడప జిల్లా నెంబర్ శీను యాదవ్ , రాజుగారు , మహిళా ప్రధాన కార్యదర్శి పార్వతి ,గంగాధర్ యాదవ్ , కృష్ణయ్య యాదవ్ ,సుబ్బయ్య యాదవ్ ,గోవింద్ ,నాగేంద్ర , నరసింహులు యాదవ్ గ నాగేంద్ర యాదవ్ లోకేష్ యాదవ్ గారు బాలాజీ యాదవ్ ఐ టీడీపీ ఆదిగారు.తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ,మొదలైన బిసి, యాదవ నాయకులతో కలిసి యాదవ సాధికార పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వై. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కాబోతున్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు.ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడం నాయకుల కార్యకర్తలపై దాడులు ఇవే సరిపోయాయి.. వైసీపీ ప్రభుత్వం లో భూ కబ్జాలు,అక్రమాలు, సామాజిక వర్గాలపై దాడులు ఎక్కువైపోయాయి. ఆనాడు పాదయాత్రలో బీసీలకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు కలియుగ దైవమైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని యాదవులకు కాకుండా రెడ్లకు కట్టబెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ప్రత్యేక హోదా ఉన్నత పదవులను కల్పిస్తే వైసీపీలో మాత్రం బీసీలు మంత్రులను ఏం మాత్రం పట్టించుకోకుండా అన్నీ ఉన్నత పదవులను రెడ్లకు కల్పించి బీసీలను అనగదొక్కింది ఈ వైసీపీ ప్రభుత్వం. టీటీడీ చైర్మన్ పదవిని యాదవులకు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం అని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.బీసీల ఓట్లతో గద్దనేక్కి ఈరోజు బీసీలను అనగ దొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని బీసీలమంతా ఐక్యమై ఈ వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుదాం. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను మనమంతా కలిసి ప్రతి ఇంటి గడప తొక్కుతూ ఈ మేనిఫెస్టోను వివరించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ని బీసీలు, యాదవులు అందరి ఐక్యతతో పార్టీని బలోపేతం చేద్దాం.చంద్రబాబు నాయుడు ని తిరిగి ముఖ్యమంత్రిని చేద్దాం.