PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శకునాల చెరువుకు నీటిని నింపడం లో వైసిపి ప్రభుత్వం విఫలం..

1 min read

పల్లెవెలుగు  వెబ్ శకునాల:  గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం తరఫున శకునాల చెరువుకి ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడం దారుణం అంటూ టిడిపి పాణ్యం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆరోపించారు  గురువారం నాడు శకునాల చెరువు ప్రాంతాన్ని నంద్యాల టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ టిడిపి నాయకుల తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్లడ్ డామేజ్ కింద రెండు సంవత్సరాల క్రితం ఐదు లక్షలకు టెండర్ పిలిచిన  ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ పనిని గాలికి వదిలేసారని పబ్లిసిటీ తప్పితే పనులు జరిగిన దాఖలు కనపడటం లేదని ఆరోపించారు చేసిన పనికి బిల్లులు రావని  వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు పనిచేయాలంటే ముందుకు రావడంలేదని కొందరు కాంట్రాక్టులు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతుండగా మరి కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు రాక మనస్థాపంతో చనిపోయారని సోలార్ ఫండ్స్ కింద రెండు కోట్ల పైనే ఈ చెరువుకు శాంక్షన్ అయిన అవి ఎక్కడికి వెళ్లాయో ఎవరికి తెలియదు అన్నారు ఇదే అదునుగా చూసుకుని వైసీపీ నాయకులు కాంట్రాక్ట్ చేస్తామని రెండు సంవత్సరాలుగా చెరువులో ఉన్న మట్టిని అక్రమంగా స్టీల్ ప్లాంట్ కు వెంచర్లకు అమ్ముకుంటున్నారని ఇంతకంటే దారుణం మట్టిని అమ్ముకోవడం నీటిని అమ్ముకోవడం అన్ని అక్రమాలకు తెర లేపారని డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులకు వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని టిడిపి ప్రభుత్వం అధికారంలో రావడం పక్కా అని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీ ప్రకారం తెలుగు గంగ నుంచి సోలార్ చెరువుకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించి. ఆ వచ్చిన నీటిని శకునాల చెరువుకు నింపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి. టిడిపి నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author