PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి చూపు మైనార్టీ నాయకుడివైపు..

1 min read

నంద్యాలలో మారుతున్న రాజకీయ సమీకరణాలు..

డి ఎస్ హబీబుల్లా కు నంద్యాల అసెంబ్లీ వైసీపీ టికెట్..

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  గతంలో నవనందులకోట అంటే గుర్తొచ్చేది నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం సంచలనాలకు మారుపేరు .రాజకీయాలకు భౌగోళిక స్వరూపం నంద్యాల వ్యాపారాలకు నిలయం నంద్యాల..అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలంటే మైనార్టీల ఓటు బ్యాంకు కీలకం గతంలో టిడిపి నుండి శాసనసభ్యుడుగా విద్యాశాఖ మంత్రిగా మండలి చైర్మన్ గా ఎన్ ఎండి ఫరూక్ మైనార్టీలకు ప్రతినిధిగా ఒక వెలుగు వెలిగారు 2017 బై ఎలక్షన్లలో అన్యుహంగా భూమా బ్రహ్మానంద రెడ్డికి టిడిపికి టికెట్ కేటాయించింది 70 వేల పైచిలుకు ముస్లిం ఓటు బ్యాంకు ఉంది ఇరు పార్టీలు తమ క్యాడర్ నాయకులు కార్యకర్తలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించగా టిడిపి తరఫున చంద్రబాబు నాయుడు వైసీపీ తరఫున అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు  టిడిపి బై ఎలక్షన్లలో గెలుపొందింది.. వైసిపి నుండి ముస్లిం సామాజిక వర్గం నాయకుడు లేకపోవడం పెద్ద మైనస్ 2014లో ఎస్ డీ పీ ఐ పార్టీ అభ్యర్థిగా స్థానికుడు ముస్లిం యువతలో క్రేజ్ ఉన్న నాయకుడు డిఎస్ హబీబుల్లా పోటీపడ్డారు కానీ ఓడిపోయారు అప్పుడే వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డ డిఎస్ హబీబుల్లా వైసిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు స్థానికంగా మంచి పేరు సమస్యలపై స్పందించి ముస్లిం మైనార్టీలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడం సమస్యలు పరిష్కరించడం హబీబుల్లాకు  కలిసి వచ్చింది టిడిపి ప్రభుత్వ హయాంలో గుంటూరులో నారా హమారా అనే కార్యక్రమంలో టిడిపి ముస్లిం మైనార్టీలకు ఎటువంటి మేలు చేయలేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్లే కార్డులు ప్రదర్శించడంతో అప్పటి టిడిపి ప్రభుత్వం 9 మందిపై రాజా ద్రోహం కేసు నమోదు చేసింది . దీంతో డిఎస్ హబీబుల్లా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ముస్లిం మైనార్టీ వర్గాల దృష్టిలో పడ్డారు . వైసిపి ప్రభుత్వం వచ్చాక దాదాపు మూడు సంవత్సరాల పైచిలుకు పాలన తర్వాత వైసిపి ప్రభుత్వం తొమ్మిది మందిపై కేసులు ఎత్తివేసింది అనంతరం డిఎస్ హబీబుల్లా కు గతంలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన రాజకీయ సమీకరణాలను బట్టి ఎమ్మెల్సీ ఇసాక్ బాషాకిచ్చి  హాబిబుల్లా ప్రభుత్వ మైనార్టీ సలహాదారుడు పదవితో సత్కరించింది..మారిన సమీకరణాల నేపథ్యంలో 2024 లో టిడిపి నాయకత్వం నంద్యాల టికెట్ మైనార్టీ వర్గానికి చెందిన ఫరూక్ కు  కేటాయించడంతో  వైసిపి నాయకత్వం కూడా మైనార్టీ వర్గానికి చెందిన డి.ఎస్ హబీబుల్లా కు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని భావిస్తున్నట్టు సమాచారం ఇప్పటికే ఐ ప్యాక్ టీం రంగంలో దిగి నంద్యాల లో సర్వే చేస్తున్నట్టు పక్క సమాచారం ఈసారి కచ్చితంగా టికెట్ వస్తే కచ్చితంగా గెలిచి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నంద్యాల బహుమతిగా ఇస్తానని డి ఎస్ హబీబుల్లా తెలిపారు . ఇక ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల వైసిపి పార్లమెంట్ టికెట్ ఇచ్చే యోచనలో వైసిపి  అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఏదేమైనా ముస్లిం మైనార్టీ సమస్యల మీద నిత్యం దృష్టిపెట్టే యోధుడు ప్రస్తుతానికి నంద్యాల జిల్లాకు అవసరం.. మరి వైసీపీ అధిష్టానం డి ఎస్ హబీబుల్లా కు  నంద్యాల టికెట్ కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి.

About Author