వైసిపి అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని ప్రతిపక్ష పార్టీలు అన్ని ఒక తాటిపైకి వచ్చి ప్రజా సంక్షేమం కొరకు పోరాడాలని మాజీ జెడ్పిటిసి సభ్యురాలు లక్ష్మీదేవి టిడిపి నాయకులు బాచెపల్లె నారాయణ వేణు అన్నారు. మండలంలోని ఆలమూరు గ్రామంలో టిడిపి నాయకుడు బాచెపల్లె నారాయణ స్వగృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ప్రజా సంరక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నియంత పాలనకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రజా పరిరక్షణ ద్వేయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం శుభపరిణామం ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలు విధ్వంస పాలన సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని వైసిపి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను మాఫియా దందాలను ప్రశ్నించి ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ ఎక్కడికి ఎక్కడ నిర్బంధానాలు చేస్తూ కేసులు పెట్టడం హేయమైన చర్య అన్నారు. వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడి వైసిపి ప్రభుత్వం విషపు కోరల నుండి రాష్ట్రాన్ని విముక్తి కలిగించేందుకు చంద్రబాబు నాయుడు పవన్ కలవడం హర్షించదగ్గ విషయం అన్నారు. తమ అధినాయకుడు చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రజాసంఘాలు ప్రజలు ఏకం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. అరాచక పాలన సాగిస్తూ ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసిన వైసిపి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికలలో ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ప్రజల సంక్షేమం కొరకు పోరాటం సాగిస్తున్న తమ అధినాయకుడు చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ముల్లరాజా రమణ అక్బర్ వలి తదితరులు ఉన్నారు.