వైయస్సార్ సంపూర్ణ పోషణ అంగన్వాడి కేంద్రాలలో ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: వైయస్సార్ సంపూర్ణ పోషణను గర్భవతులు తీసుకోవడం ద్వారా రక్తం బాగా అభివృద్ధి చెందుతుందని, తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని వార్డు కౌన్సిలర్ యూనుస్, వాకిటి పేట కౌన్సిలర్ నూర్జహాన్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని రాజా వీధి, అంగన్వాడి స్కూల్ 22, 23, 24 అంగనవాడి కేంద్రాలలో వైయస్సార్ సంపూర్ణ పోషణ నుకౌన్సిలర్ యూనుస్, వాకిటి పేట కౌన్సిలర్ నూర్జహాన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భవతులు బాలింతలకు పేస్ యాప్ సహాయంతో వైయస్సార్ సంపూర్ణ పోషణ అందజేయడం జరుగుతుందన్నారు. మూడు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, పావు కేజీ ఆయిల్, 25 గుడ్లు, ఐదు లీటర్ల పాలు, అదేవిధంగా సంపూర్ణ పోషణ కిట్టు అటుకులు కేజీ, రాగి పిండి 2 కేజీలు, బుడ్డల చిక్కిళ్ళు 250 గ్రాములు, బెల్లం 250 గ్రాములు, ఖర్జూరాలు 250 గ్రాములు ఇవ్వడం జరుగుతుందన్నారు. వీటిని గర్భవతులు, తల్లి బిడ్డలు ఉపయోగించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు గర్భవతులు, తదితరులు పాల్గొన్నారు.