వైయస్సార్ జలకళ సన్నకారు రైతులకు ఒక వరం: ఎమ్మెల్యే
1 min read– ఫతేనగర్,కటికవానికుంట గ్రామాల్లో జలకళ పథకం ద్వారా 24 బోర్లు మంజూరు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు బనగానపల్లె మండలం ఫతేనగర్ కటికవానికుంట గ్రామాలకు చెందిన పలువురు రైతులు జలకల పథకం ద్వారా తమ పొలాల్లో వ్యవసాయ బోర్లు వేసినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి,కాటసాని ఓబుల్ రెడ్డి గారికి శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ బనగానపల్లె మండలానికి చెందిన ఫతేనగర్ కటికవానికుంట గ్రామాలకు జలకల పథకం ద్వారా 24 బోర్లు మంజూరు చేయడం జరిగిందని అయితే 24 బోర్లకు 24 బోర్లు లో నీరు సమృద్ధిగా పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గంలో జలకల పథకం ద్వారా ఇప్పటికే 800 నుంచి 1000 బోర్లు రైతులకు వేయడం జరిగిందని చెప్పారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు. వ్యవసాయం పట్ల రైతులకు ఆసక్తి కల్పించాలని లక్ష్యంతోనే రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం 13500 రైతులకు పెట్టుబడిగా అందించడం జరుగుతుందని అలాగే ధరల స్థిరీకరణ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని రైతులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యాగంటి దేవస్థానం చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, కటికవానికుంట,ఫతే నగర్ గ్రామ వైయస్సార్ పార్టీనాయకుడుమల్లేష్రెడ్డి,వేణుగోపాల్, నాగయ్య,బోయమల్లేష్,బోయప్రతాప్,బోయభూపాల్,మచ్చ భాస్కర్,పర్లపాటి కృష్ణుడు,పర్లపాటి నాగరాజు, పర్లపాటి కేశాలు, పర్లపాటీ బాలమద్ది,కుమ్మరి నారాయణ,మిద్దె బాల మద్దయ్యా,శరవేటి మల్లికార్జున, పర్లపాటి వేణుగోపాల్,అక్కన్నగారి కృష్ణమూర్తి,తదితరులు పాల్గొన్నారు.