కౌతాళం మండల కేంద్రంలో వైయస్సార్ ఆసరా సంబరాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం: మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండల కేంద్రమైన కార్యక్రమం నిర్వహించగా ,ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ ఆసరా సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది, కౌతాళం మండలంలో దాదాపుగా 830 గ్రూపులకు గాను 326. 87 లక్షల రూపాయల చెక్కులను వైయస్సార్ ఆసరా పథకం కింద పొదుపు సంఘాల లబ్ధిదారులకు గౌరవనీయులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి, చేతుల మీదుగా అందించడం జరిగింది, కార్యక్రమం ప్రారంభంలో పొదుపు సంఘాల మహిళల ప్రార్థన గీతంతో ప్రారంభించి కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల అందరికీ పూలమాలవేసి అభినందించడం జరిగింది, అలాగే మండలంలోని పొదుపు సంఘాల మహిళ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి , చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీల మేరకు 14 ఏప్రిల్ 2019 వరకు ఉన్న పొదుపు సంఘాల మొత్తం రుణాన్ని మాఫీ చేసి ఇప్పటికే రెండు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన ముఖ్యమంత్రి మూడో విడత కింద ఈరోజు 326.87 లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగలు బదిలీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నేరుగా నగదు బదిలీ ద్వారా అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు, మన పార్టీ మీద కొంతమంది వ్యక్తులు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమాల గురించి ప్రజలకు కార్యకర్తలు అవగాహన కల్పించి మన ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి మరొక్కసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందుకు మీ ఎనలేని అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటానని తెలిపారు, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాధా ప్రియదర్శిని, ఎంపీపీ అమరేష్, తాసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి, ఏవో శేషాద్రి, ఐకెపి మండల అధికారి మరియు సిబ్బంది, మండల నాయకులు కృష్ణంరాజు, ప్రహ్లాద దేసాయి ఆచారి, ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాగరాజు గౌడ్, వీరసేనారెడ్డి,రామన్న గౌడ్, మరే గౌడ, వెంకటరామిరెడ్డి, గుర్నాథ్ రెడ్డి, కౌతాళం సర్పంచ్ పాల్ దినకర్, ఎంపిటిసి రాజ్ అహ్మద్, లింగన్న గౌడ్, సమద్, వడ్డే రామన్న, తిక్కన్న,మండల భీమా యూత్ నాయకులు, మరియు సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు, పత్రికా మిత్రులు, పొదుపు సంఘాల మహిళలు మరియు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.