వైయస్సార్ ఆసరా మూడవ విడత… రూ.141.26 కోట్ల లబ్ది
1 min read– మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం
– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వైయస్సార్ ఆసరా మూడవ విడత లో జిల్లాలో 25,507 మహిళా సంఘాలలోని 2,46,807 మంది సభ్యులకు రూ.141.26 కోట్ల లబ్ది చేకూరిందని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వైఎస్సార్ ఆసరా మూడవ విడత కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కర్నూలు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కోడుమూరు శాసన సభ్యులు డా.జె.సుధాకర్ తదితరులు వీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.. వైఎస్ఆర్ ఆసరా మూడవ విడతకు సంబంధించి డీఆర్డీడిఎ ద్వారా 17,316 మహిళా సంఘాలలోని 1,73,228 మందికి రూ.90.83 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని మెప్మా ద్వారా 8191 సంఘాలకు చెందిన 75,379 మందికి రూ.50. 43 కోట్లు మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం చేసిందన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళలు ఆర్థికంగా ఎవరి మీద ఆధార పడకుండా స్వయం ఉపాధిని కల్పించుకుని వారి కుటుంబాలను పోషించుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక సాధికారత తో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు.జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాలుగు వాయిదా ల్లో రుణాలను తిరిగి చెల్లిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు మూడు విడతలుగా మహిళల రుణ మొత్తాలను తిరిగి వారి ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచిందన్నారు.కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ జె. సుధాకర్ మాట్లాడుతూ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రభుత్వానికి రావలసిన ఆదాయం రాని పరిస్థితిలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కోడుమూరు శాసన సభ్యులు జె.సుధాకర్ చేతుల మీదుగా డిఆర్డిఎ సంబంధించి రూ.90కోట్ల 83లక్షలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించిన రూ.50.44కోట్ల మెగా చెక్కును మహిళలకు అందజేశారు. డిఆర్డిఏ ద్వారా నియోజకవర్గం వారీగా లబ్ది పొందిన సంఘాల వివరాలుఆదోని నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 1174 ; అమౌంట్ : రూ.516.96లక్షలుఆలూరు నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 2708 ; అమౌంట్ : రూ.1292.01 లక్షలుకోడుమూరు నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 3422 ; అమౌంట్ : రూ.2002.17 లక్షలుమంత్రాలయం నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 3110; అమౌంట్ : రూ.1429.23 లక్షలుపాణ్యం నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 1703 ; అమౌంట్ : రూ.1023.58లక్షలుపత్తికొండ నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 3202 ; అమౌంట్ : రూ.1794.08 లక్షలుఎమ్మిగనూరు నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 1997 ; అమౌంట్ : రూ.1024.98 లక్షలుమెప్మా ద్వారా నియోజకవర్గం వారీగా లబ్ది పొందిన సంఘాల వివరాలుకర్నూలు నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 4617; అమౌంట్ : రూ.29.21కోట్లుఆదోని నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 1575; అమౌంట్ : రూ.9.17కోట్లుగూడూరు నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 372; అమౌంట్ : రూ.2.25కోట్లుఎమ్మిగనూరు నియోజకవర్గం : స్వయం సహాయక సంఘాలు : 1627; అమౌంట్ : రూ.9.80కోట్లుఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి వెంకట సుబ్బయ్య, ఎపిడి శ్రీధర్ రావు, ఎల్డిఎం వెంకట నారాయణ, సిబ్బంది, మెప్మా పిడి నాగ శివ లీల లబ్ధిదారులు పాల్గొన్నారు.