వైయస్ఆర్ భీమా నిరుపేదలకు అండ
1 min read– వార్డు ఇంచార్జ్ పాతకోట రమేష్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబాలకు అండగా మన ముఖ్యమంత్రి వై ఎస్ జగనన్న ఉన్నారని వై ఎస్ ఆర్ భీమా నిరుపేదలకు కొండంత అండ అని 13వ వార్డు వైకాపా ఇంచార్జ్ పాతకోట రమేష్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు నందు నివాసముంటున్న చంద్రమౌళి అనే వ్యక్తి సోమవారం మరణించడంతో విషయం తెలుసుకున్న కౌన్సిలర్ పి.శాంతకుమారి, పి.రమేష్ లు మంగళవారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ భీమ పథకం ద్వారా రూ.10 వేలు మృతుడి భార్య సుజాతమ్మ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రెటరీ హరీష్, వార్డు వెల్ఫేర్ సెక్రెటరీ గౌరీ, వాలంటీర్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.