పేదవాడు బాగుండాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రావాలి
1 min readపేదవానికి భవిష్యత్ ఉండాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రావాలి…
విరుపాక్షి కే మన ఓటు ….ఫ్యాన్ గుర్తుకే మన ఓటు……
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు నియోజకవర్గం కరిడిగుడ్డం, ముద్దనగేరి, కురుకుంద, హులెబీడు గ్రామాల పర్యటనకు విచ్చేసిన ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ బుసినే విరుపాక్షి గారికి బ్రహ్మరథం పట్టిన మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు గ్రామాలలో నాయకులు కార్యకర్తలు కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ గడప గడపకు తిరుగుతూ నన్ను మీ బిడ్డగా మీ కొడుకుగా ఆదరించాలని కోరుతూ కరిడిగుడ్డం గ్రామంలో దేవాలయంలో మహాయోగి మంగమ్మవ్వకు ప్రత్యెక పూజలు చేశారు .అనంతరం ముద్దనగేరి, కురుకుంద, హులెబీడు గ్రామాలలో శ్రీ బుసినే విరుపాక్షి పర్యటిస్తూ ముద్దనగేరి రాములమ్మవ్వ దేవాలయంలో పూజలు చేసి గ్రామ సర్పంచ్ మరియు నాయకులు కార్యకర్తలతో కలసి గ్రామంలో ప్రజల సమస్యలు వింటూ ఆ సమస్యలను నోట్ చేసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని కోరడం జరిగింది . కురుకుంద గ్రామంలో మాజీ ఎంపీటీసీ ఏసన్న, శ్రీనివాసులు టీడీపీ పార్టీని వీడి వైఎస్సార్సీపీ భీమయ్య ఆద్వర్యంలో శ్రీ బుసినే విరుపాక్షి సమక్షంలో చేరడం జరిగింది .ప్రజలతో శ్రీ బుసినే విరుపాక్షి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్న నాయకుడు సీఎం జగనన్న అని విరుపాక్షి అన్నారు . ఏ పేదవాడు ఆరోగ్యం కోసం బాధపడకూడదని, వైద్యం కోసం ఎవరు మరణించకూడదని, గ్రామాలలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పెట్టి ఇంటింటికి వైద్యున్ని పంపి వైద్యం అందిస్తున్న గొప్ప నాయకుడు జగనన్న అని విరూపా క్షి అన్నారు . సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టీ ప్రజల వద్దకే పాలనను తెచ్చిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగనన్న మాత్రమే నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యం మీకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూనే ఉన్నాను నేడు 2024లో మరోసారి గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదాలతో ఆలూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను .నియోజకవర్గ పెద్దలు,అవ్వ తాతలు,అక్కా చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్లు,సోదరులు, స్నేహితులు మీ అందరి ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను ముందుగా హలహర్వి మండలం నెట్రవట్టి గ్రామానికీ చెందిన 20 కుటుంబాలు టీడీపీ పార్టీని వీడి శ్రీ బుసినే విరుపాక్షి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది .హులెబీడు గ్రామంలో 50 కుటుంబాలు శ్రీ బుసినే విరుపాక్షి సమక్షంలో గ్రామ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ పార్టీని వీడి వైఎస్సార్సీపీ పార్టీలో చేరడం జరిగింది.అనంతరం హులెబీడు లోని హీరా మొహద్దీన్ సాబ్ తాత దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు .ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ కుటుంబ సభ్యులు ఆలూరు అసెంబ్లీ JCS కో-ఆర్డినేటర్ ఓబులేష్ ,ఆలూరు జెడ్పీటిసి ఏరూరు శేఖర్ , చిప్పగిరి మండల కన్వీనర్ జూటూరు మారయ్య ,మొలగవల్లి వాల్మీకి రామంజినేయులు , ఆలూరు మండల కన్వీనర్ చిన్న ఈరన్న ,మండల కో కన్వీనర్ అరికెర వీరేశ్ , బెల్డోన సొసైటీ చైర్మన్ మల్లిఖార్జున ,ఆలూరు వైస్ ఎంపీపీ నాగవేణి శ్రీధర్, కో – ఆప్షన్ సభ్యులు బాషా,ముద్దనగేరి సర్పంచ్ సుధాకర్ రెడ్డి , కురుకుంద సర్పంచ్ దేవిరెడ్డి , మొలగవల్లి తిక్కన్న శివమణి,సురేష్, కరిడిగుడ్డం సూరి, డీలర్ అరికెర వెంకటేశ్, హులేబీడు సర్పంచ్ రామంజి, రామలింగ, మోదిన్, k వెంకటేష్,నగేష్, కురవల్లి శివన్న,మీ సేవ ఈరన్న, JCS ఆలూరు మండల ఇంచార్జ్ బూర్ల ఆనంద్,సచివాలయం కన్వీనర్లు, విద్యా కమిటీ చైర్మన్లు,నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.