PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

1 min read

– పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రజా క్షేత్రంలో పురుడుపోసుకున్న పార్టీ..
– దేశచరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానానికి ప్రత్యేకత..
– జగనన్న పాలనకు ప్రజల నీరాజనం..
–అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా జగనన్న పాలన..
–పార్టీకి కష్ట నష్టాలలో తోడుగా, అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తొగురు ఆర్థర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజల గుండెల్లో పుట్టి, విశ్వసనీయత, విలువలు, సిద్ధాంతాలుతో ప్రజాక్షేత్రంలో పురుడుపోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట్ అని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.వైసీపీ పార్టీ 12వసంతాలు పూర్తి చేసుకొని 13వ వసంతంలోకి అడుపెడుతున్న సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్ఆర్ అకాల మరణం తరువాత ఆయన లక్ష్యాలు, ఆశయాలును ముందుకు తీసుకెళ్లేందుకు,ప్రజల కోసం వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. జగన్ పోరాటపటిమే పన్నేండ్ల రాజకీయ ప్రస్థానానికి నిదర్శనమన్నారు.దేశ చరిత్రలోనే పార్టీ ప్రస్థానానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి అనతికాలంలోనే అధికారం చేపట్టి ఆదర్శంగా, పారదర్శకంగా పాలన సాగిస్తూ ప్రజాభిమానాన్ని మెండుగా సీఎం జగన్ పొందారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు.
ఎన్నికల హామీలను నెరవేర్చిన సీఎం జగన్ ..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ జగన్ పాలనలో పేదలకు అందినన్ని సంక్షేమ పథకాలు ఎవ్వరూ అందించలేదన్నారు. సచివాలయ, వాలంటరీ వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే పాలన అందిస్తున్నారన్నారు. పేదలు, రైతులు,మహిళల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.జగన్ పాలనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు.జగన్ అమలుచేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజల గుండెల్లో నిలిచిందన్నారు. పార్టీకి కష్ట నష్టాలలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సేవా కార్యక్రమాలు…సేవా కార్యక్రమాల నిర్వహించడం ద్వారా ప్రత్యేకగుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో వైసీపీ నేతలు వృద్దులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి..
మార్చి 13న జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో
పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్ర రెడ్డి , స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి అలంపూర్ మధుసూదన్ నాయుడు లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి వీరి విజయాన్ని బహుమతిగా అందించూద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి ,రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ సుకూర్ , మున్సిపల్ కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి , మొల్ల జాకీర్ హుస్సేన్ , వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సగినేల వెంకటరమణ , జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చంటి గారి దిలీప్ రాజ్ , నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ ఉసేనయ్య ,పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డా. వనజ ,వైసీపీ నాయకులు తమ్మడపల్లె విక్టర్, విశ్రాంత పోలీస్ అధికారి పేరుమాళ్ళ జాన్, తాటిపాడు అయ్యన్న, భాస్కర్ ,బిజినవేముల మహేష్, మల్యాల శంకరయ్య, లక్ష్మాపురం గౌడ్,సుభాన్,చిట్టి రెడ్డి, పారుమంచాల దేవ సహాయం, పోతులపాడు శివానందరెడ్డి, తమ్మడపల్లె ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ దేశెట్టి శ్రీనివాసులు ,పట్టణ వైస్సార్సీపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ పసుల శ్రీనివాస నాయుడు,పఠాన్ రసూల్ ఖాన్,పై పాలెం ఇనయతుల్లా, దామగట్ల రత్నం, వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author