PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్న శ్రీ బుసినే విరుపాక్షి  

1 min read

ఘనంగా 14 వ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భవించి 13 వసంతాలు పూర్తిచేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  జెండాను శ్రీ బుసినే విరుపాక్షి గారు ఆవిష్కరించడం జరిగింది .అనంతరం ఆలూరు మండల కేంద్రం పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీ బుసినే విరుపాక్షి .అనంతరం ఆలూరు మండల కేంద్రంలోని  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి బ్రెడ్డు మరియు పళ్ళు అందించి ఆసుపత్రిలో వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్న శ్రీ బుసినే విరుపాక్షిఅనంతరం ఆలూరు పట్టణంలో కొట్టాల వీధి, కోట వీధులలో గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది .  కోటవీధి ప్రాంతంలో వెలసిన సుంకులమ్మవ్వ దేవి ఆలయం మరియు శివాలయంలో ప్రత్యేక  పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది సచివాలయ ప్రారంభోత్సవంలో ఆలూరు శ్రీ బుసినే విరుపాక్షిఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం, హత్తి బెళగల్ గ్రామంలో నూతన సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రంను శ్రీ బుసినే విరుపాక్షి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది

 బుసినే విరుపాక్షి మాట్లాడుతూ

సీఎం వైఎస్ జగనన్న  ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శం ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే గొప్ప సంకల్పంతో గ్రామాలలోని సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో ఉద్యోగులను నియమించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన సీఎం జగనన్న గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను నిజం చేసిన సీఎం జగనన్న సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రతి గడపకు సంక్షేమాన్ని చేరవేసిన సీఎం జగనన్న భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయని ఆలోచనను అభివృద్ధిని చేసి చూపించిన సీఎం జగనన్న .సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల దగ్గరికి చేర్చిన గొప్ప సీఎం జగనన్న

పేద ప్రజల పక్షపాతి, మహిళా పక్షపాతి సీఎం జగనన్న  ప్రతి పేద బిడ్డ మంచి చదువు చదవాలని పెద్దపెద్ద చదువులు చదవాలని ఆశించి బడులను దేవాలయాలుగా మార్చిన సీఎం జగనన్న ఏపేదవాడు వైద్యం కోసం అప్పులు చేయకు రాదని చనిపోరాదని 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని, గ్రామాల్లోనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే వైద్యాన్ని తెచ్చిన మంచి మనసున్న గొప్ప సీఎం జగనన్న రాబోయే ఎన్నికల్లో నన్ను నీ బిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని కోరిన శ్రీ బుసినే విరుపాక్షి .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మొలగవల్లి రామాంజనేయులు , ఆలూరు మండల జెడ్పీటీసి శ్రీ ఏరూరు శేఖర్ ,ఆలూరు మండల కన్వీనర్ శ్రీ చిన్న ఈరన్న , మండల కో కన్వీనర్ శ్రీ అరికెర వీరేశ్ , చిప్పగిరి ఎంపీపీ మండల అధ్యక్షుడు శ్రీ మారయ్య , అసెంబ్లీ జేసీఎస్ కోఆర్డినేటర్ ఓబులేష్ , ఆలూరు మండల ఎంపిపి , కో ఆప్షన్ సభ్యులు భాషా , ఆలూరు మండల వైస్ ఎంపీపీ నాగవేణి శ్రీధర్ గారు,బెల్డోన సొసైటీ చైర్మన్ మల్లికార్జున , Ex ఎంపీటీసీ పెట్రోల్ బంక్ కిషోర్, హులేబీడు రామలింగ, ఆలూరు మండల JCS ఇంచార్జ్ బూర్ల ఆనంద్,  మొలగవల్లి తిక్కన్న, రిటైర్డ్ ఎమ్మార్వో శ్రీ మాదన్న , కురువల్లి శివయ్య, అరికేర వెంకటేష్, ఉరుకుందు, రాముడు, మండలంలో గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు వార్డు మెంబర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు, విద్యా కమిటీ చైర్మన్లు, వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

About Author