PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ఆర్ సిపి మీడియా కోఆర్డినేటర్ గా కోలా భాస్కర్ నియామకం..

1 min read

అభినందనలు తెలిపిన పలువురు నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వైయస్సార్సీపి ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గం నగర కమిటీ అనుబంధ విభాగాల్లో పలువురు నాయకులు నియమాకాలకు పదవులు కేటాయించారు. ఏలూరు నగర పార్టీ అధ్యక్షులు ఎడా చైర్మన్ వద్దనే శ్రీనివాస్ ఆదివారం నూతనంగా చేపట్టిన నియమాకాలకు సంబంధించి ఉత్తర జారీ చేశారు వైయస్సార్సీపి ఏలూరు నగర కమిటీ జనరల్ సెక్రటరీలుగా కోటగిరి వెంకటేశ్వరరావు, షేక్ రహీం తుల్లా, ఏలూరు నియోజకవర్గం పార్టీ మీడియా కోఆర్డినేటర్ గా కోలా భాస్కరరావు నియమితులయ్యారు. ఏలూరు బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా మరడాని రమేష్, ఏలూరు నగర ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీగా చోడగిరి అనిల్ కుమార్ నియమితులయ్యారని ఒక  ప్రకటనలో తెలిపారు. వీరికి పలువురు పార్టీ నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.

About Author